alochana
Posted: February 2, 2011 Filed under: Uncategorized | Tags: random thoughts 2 Comments »తొలి మాట
కొన్ని పాటలు బావుంటాయి. కొన్ని రాతలు బావుంటాయి. కొన్ని చిత్రాలు బావుంటాయి. కొన్ని సార్లే ఆటలు కూడా బావుంటాయి. కొన్ని సాయంసంధ్యలు కూడా బావుంటాయి. మరికొన్ని సూర్యోదయాలూ బావుంటాయి. ఆ కొన్ని కొన్నిగానే ఉంటే బావుంటుంది.
కాని మనం అన్నీ బావుండాలనుకుంటాం. ప్రతి రోజూ బావుండాలి. మనతో ఇతరులు మాట్లాడే ప్రతి మాటా బావుండాలి. ఇతరుల ప్రతీ స్పందనా బావుండాలి. చూసే చూపు..నవ్వే నవ్వు అన్నీ బావుండాలి.
ప్రపంచంలో అంతా స్వపక్షమే ఉంటే విపక్షం ఏమిటో ఎలా తెలుస్తుంది? బాస్ ఎప్పుడూ ముద్దు చేస్తుంటే- తిట్ల జడివాన జోరెలా తెలుస్తుంది?
అందుకే జీవితమంతా రంగులే ఉంటే బావుండదు. బ్లాక్ అండ్ వైట్‌లా కూడా ఉండాలి.
(తెలుగులో ఇలాంటి రాతలు రాయటం ఇదే తొలిసారి. మలిసారి కాకూడదనేది ఆకాంక్ష. మీరు ఆదరిస్తారని ఆశిస్తా.. దీనితో అవి ఇవి అని లేదు. అన్నీ ఉంటాయి..)
Hello world!
Posted: February 2, 2011 Filed under: Uncategorized Leave a comment »Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!